తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.అయితే చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఈరోజు సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ…రాష్ట్రం అన్ని రంగాలలో ముందుంది..పాపం చంద్రబాబు అరెస్టు అయినట్టున్నారు.ఈ సమయంలో ఆయన గురించి మాట్లాడకూడదు కానీ.. ఆయన గతంలో ఐటి ఐటి అనేవారు…నిజానికి హైదరాబాద్ లో ఐటీ కెసిఆర్ వల్ల అభివృద్ధి అయింది. పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. తెలంగాణ వచ్చినప్పుడు మూడు లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగాలు నేడు 10 లక్షలకు చేరాయి” అన్నారు