ఈ ఏడాది 2021-22 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులపై నిర్వహించిన వెబినార్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిచారు.ఈమేరకు ఆయన మాట్లాడుతూ …వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు.చిన్న,సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే దేశం అభివృద్ధి సాదించలేదన్నారు.రైతుల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపుని తమ ప్రభుత్వం భారీగా పెంచిందని చెప్పారు.
కాగా బడ్జెట్లో పశు సంవర్ధక, పాడి, చేపల పెంపకానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు.వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని ప్రభుత్వం 16లక్షల 50వేల కోట్లకు పెంచిందని తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల నిధిని కూడా 40 వేల కోట్లకు, సూక్ష్మ నీటి పారుదల నిధులను రెట్టింపు చేశామని ప్రధాని తెలిపారు.అలానే ఈ–నామ్ వ్యవస్థకు దాదాపు 1000కి పైగా మండీలను అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.దేశంలో ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ విప్లవం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.