Spread the love

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేలపై బైఠాయించి నిరసన తెలుపారు.కాగా చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది.కోవిడ్ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతిలేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలోనే ఆగిపోయారు.మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్నారు.కాగా తిరుపతి ఎస్పీ,కలెక్టర్లను కలుస్తానని చంద్రబాబు పోలీసులతో అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నా రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు గారిని పోలీసులు నిలిపివేసారని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో వెల్లడించింది.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *