Spread the love

తాజాగా తాడికొండ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.గుంటూరు జిల్లాలో వైసీపీ మహిళ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు మహిళా నియోజకవర్గాల్లో తాడికొండ నియోకవర్గంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు.

ఈ గెలుపుతో తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకత లేదని ఫలితాలు చెబుతున్నాయని వైసిపి వర్గాలు పేర్కొన్నాయి.కాగా ఈ ఎన్నికల్లో
80 శాతానికి పైగా పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

అయితే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 62,65 శాతానికే పరిమితం కాగా…తాడికొండ నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల తీరును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు గమనించారు.అలానే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అని ఈ నియోజకవర్గం వైపు చూశారు.

అమరావతిలో కేవలం శాసనరాజధానిని మాత్రమే ఉంటుందని వైసీపీ ప్రభుత్వం ఘంటా పథంగా చెబుతున్న సమయంలో.. పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి డిపాజిట్లు కూడా రావని రాజకీయ విశ్లేషకులు భావించారు.ఓ పక్క ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల దాడిని అధికార పక్షం సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే దానికి తగినట్లుగానే ఎన్నికలకు సిద్ధమైంది.అయితే రాష్ట్రం మొత్తం తాడికొండ నియోజకవర్గంలో ఏం జరుగుతోందని ఉత్కంఠగా ఎదురు చుశారు.తీరా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ,సీనియర్ వైసిపి నాయకుడు మర్రి రాజశేఖర్, తాడికొండ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నూతలపాటి హనుమయ్యతో కలిసి నిత్యం అన్ని గ్రామాలలో పర్యటించి గ్రామస్థాయి  నాయకులతో చర్చలు జరిపారు.తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ మరోసారి గెలిచేందుకు పక్కా ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగారు.

అయితే ఓ వైపు అమరావతి రాజధాని ఉద్యమం…మరో వైపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాటు అమలు చేసిన సంక్షేమ పథకాల మధ్య యుద్ధం జరిగింది.తెలుగుదేశం పార్టీ నాయకులేమో అమరావతి ప్రాంతంలో రాజధానిని తీసేస్తున్నారు.ఇక్కడ రాజధాని ఉండదని తప్పుడు ప్రచారం చేశారు.

అయితే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం అమరావతిలో శాసనరాజధాని ఉంటుందనడంతో పాటు…సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు గురించి నియోజకవర్గ ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 46 పంచాయతీ ఎన్నికలు జరగ్గా 38 పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

గుంటూరు జిల్లాలో ముగ్గురు మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరితగారి నియోజకవర్గం..ప్రస్తుతం ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో హోంమంత్రిగా పని చేస్తున్నారు.ఇక పంచాయతీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 63 శాతం మాత్రమే గెలిచారు.ఇక విడదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కేవలం 62.77 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది.

ఇక తాడికొండ నియోజకవర్గంలో మాత్రం 80 శాతానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు.ఇందులోనూ సగానికి పైగా గ్రామాల్లో మహిళలు విజయం సాధించారు. ఎమ్మెల్యే శ్రీదేవిపై వ్యతిరేకత ఉందని కేవలం కొంత మంది దుష్ప్రాచారం చేశారని..కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం ఎమ్మెల్యే పనితీరుకు ఎనబై శాతం స్థానాల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా వైసిపికి చెందిన ముగ్గురు మహిళల్లో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నూటికి 90 శాతం వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »