2020లో ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.తాజాగా నితిన్ నటించిన రంగ్ దే, చెక్ , వంటి చిత్రాలకు విడుదల తేదీలు కూడా ఖరారు అయ్యాయి.ఈ నెలలో చెక్ చిత్రం విడుదలకానుంది.వచ్చే నెలలో ‘రంగ్ దే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా నితిన్ 30వ చిత్రం కూడా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది.శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఆకెళ్ల రాజ్ కుమార్ సమర్పణలో సుధాకర్ రెడ్డి ,నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో నభ నటేష్ కథానాయకగా నటిస్తుండగా…తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటిస్తుందని సమాచారం.ఈ చిత్రానికి మహతి సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.ఇదివరకు కనిపించని కొత్త పాత్రలో నితిన్ సందడి చేయనున్నారు.వైవిధ్యమైన కథతో రూపొందుతున్న ఈచిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తుంది.