Spread the love

భారత్ క్రికెట్ జట్టు ఓపెనర్ గా బరిలోకి దిగినప్పటి నుండి  “హిట్‘మ్యాన్” రోహిత్ శర్మ రికార్డ్ లు బద్దలు కొడుతూనే ఉన్నాడు.గడిచిన కొన్ని ఏళ్లుగా రికార్డుల మీద రికార్డులు తిరగేస్తున్నాడు. టీ20,వన్డే, ఈ మధ్య టెస్టు ఓపెనర్ గానూ అదరగొడుతున్నాడు.కాగా సెంచరీ చేయడానికే తంటాలు పడుతున్న ఈ రోజుల్లో రోహిత్ శర్మ వన్డేలో మూడు డబుల్ సెంచరీలు కొట్టి అందరితో ఔరా అనిపించాడు.

సరిగ్గా 6 సంవత్సరాల క్రితం అంటే నవంబర్ 13, 2014 ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో  జరిగిన వన్డేలో మ్యాచ్ లో రోహిత్ 264 పరుగులతో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత (264) స్కోరు రోహిత్ శర్మదే. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు రోహిత్. ఈ రికార్డ్ ఇన్నింగ్స్ కు 6 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రోహిత్ శర్మను కెప్టెన్ చేయాల్సిందే:-గౌతమ్ గంభీర్

రోహిత్ శర్మకు వన్డేలు, T20ల సారథ్య బాధ్యతలు అప్పగించాలని గౌతం గంభీర్ డిమాండ్ చేశాడు. ‘ధోనీ 2 వరల్డ్ కప్ లు, 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ అంటాం…అలా చూస్తే రోహిత్ 5 ట్రోఫీలు గెలిపించాడు..విరాట్ ఒక్కటీ గెలవలేదు. ఇంతకంటే రోహిత్ నిరూపించుకోవాల్సిందేమీ లేదు.కెప్టెన్సీని విడదీస్తే తప్పేమీ కాదు.రోహిత్ శర్మను కెప్టెన్ చేయకపోతే టీమిండియాకే సిగ్గు చేటు, అతడికి నష్టమేం లేదు’ అని గంభీర్ చెప్పాడు.

పగ్గాలు రోహిత్ కు ఇవ్వాలి : పఠాన్

కోహ్లీ సెలవుల్లో ఉన్నప్పుడు భారత టెస్టు జట్టు బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.రహానేకు తాను వ్యతిరేకం కాదని .. కెప్టెన్సీలో అనుభవం ఉన్న రోహిత్ కు బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నాడు . ‘ కోహ్లి లేని లోటును ఎవరూ తీర్చలేరు . 2008లో కంగారూల గడ్డపై తన తొలి వన్డే సిరీస్ లో రోహిత్ గొప్పగా ఆడాడు.అనుభవం లేని పిచ్ లపై మంచి ప్రదర్శన చేశాడుని పఠాన్ అన్నాడు.

వరల్డ్ కప్ గెలవాలంటే రోహిత్ ను కెప్టెన్ చేయాలి:-మైకేల్ వాన్

రోహిత్ ను టి-20 లకు కెప్టెన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇదే మాట చెప్పాడు . టీమ్ ఇండియా టి-20 జట్టు సారథిగా రోహిత్ శర్మను నియమించాలని. ఇందులో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు . అతనో అద్భుతమైన నాయకుడు .టి-20 ల్లో ఎలా గెలవాలో తెలుసు.విరాట్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆటగాడిగానే ఉంచాలి. భారత్ T20 ప్రపంచకప్ గెలవాలంటే రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వడం ఎంతో అవసరం ‘ అని చెప్పాడు.

 

 

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »