ఆంధ్రప్రదేశ్ లాసెట్ – 2020 పరీక్ష ఫలితాలు నిన్న విడుదలయ్యాయి.ఈ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కన్వీనర్ జ్యోతి విజయకుమార్, రెక్టార్ కృష్ణానాయక్ విడుదల చేశారు.కాగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఏపి లాసెట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18371 మంది పరీక్ష రాయగా.. 11226 మంది అభ్యర్థులు లాసెట్ లో ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.