ఈరోజు తెల్లవారు జామున విశాఖపట్టణంలోని స్టీల్ ఫ్లాంట్ ధర్మల్ విద్యుత్ ఫ్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లోని టీపీసీ2లో టర్బైన్ ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి.దీంతో 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా రూ. రెండు కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
కాగా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.