Spread the love

లోక్ సభ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలుగా విజయం సాధించి పటిష్టమైన సంఖ్య బలంతో అధికారం చేపట్టిన బీజేపీ బలం రాజ్యసభలో కూడా మరింత పెరిగింది.కాగా రాజ్యసభ ఎంపీల సంఖ్యలో శతకం సాధించింది.నిన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పెద్దల సభకు ఎన్నికకావడంతో బిజెపి ఈ ఘనత సాధించింది.రాజ్యసభలో ప్రస్తుత సభ్యులు 242 మంది కాగా,ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 38 మంది సభ్యులున్నారు.

అయితే నిన్న ఉత్తరప్రదేశ్ నుండి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సహా  మొత్తం 10 మంది ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.వీరిలో 8మంది బీజేపీ వారే ఉన్నారు.ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ  నుండి ఒకరు ,అలానే బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుండి మరొకరు ఒకరు నెగ్గారు.తాజాగా నిన్న జరిగిన ఎన్నికలతో కలిపి ఉత్తరప్రదేశ్ లో 31కు గానూ 22 బీజేపీకి దక్కినట్లయింది.కాగా రాజ్యసభలో సంపూర్ణ బలం కావాలంటే 121 మంది సభ్యులు ఉండాలి.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »