Spread the love

పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు స్పందించారు.ఈ మేరకు ఆయన స్పందిస్తూ ….పోలవరం బకాయిలను బేషరతుగా విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయంపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే నిధుల విడుదల కోసం కేంద్ర జలశక్తి శాఖకు సూచించడం ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.కాగా  రూ.2,234 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఏ విధమైన అభ్యంతరాలు లేవని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది.ఈ అంశానికి సంబంధించి పీపీఏ ప్రక్రియ పూర్తిచేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపింది.

By TheHind360

#TheHind360 is a Telugu daily digital newspaper of Andhra Pradesh & telangana.we present include business ,politics , national ,film ,sports &world news etc...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *