ఆసియా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో భారత పురుషుల జట్టు మహిళల జట్టు సెమీఫైనల్ లో విజయాలు సాధించి ఫైనల్ లో ప్రవేశించాయి. నిన్న జరిగిన సెమీస్ లో పురుషుల జట్టు కజకిస్థాన్ పై విజయం సాధించగా.. మహిళల జట్టు మంగోలియా పై గెలుపొందింది. పురుషులజట్టు మొదటి రౌండ్ లో 3.5-1.5 తో విజయం సాధించింది.రెండో రౌండ్ లో 3-1తో గెలిచి ముందంజ వేసింది. మహిళల జట్టు మొదటి రౌండ్ లో 3.5-0.5తో గెలుపొందారు.రెండవ రౌండ్ లో 4-0తో విజయం సాధించారు.